శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ ఆహ్వానం

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ మహోత్సవాలు తేది 26-04-2026 ఆదివారం తెనాలిలో ఘనంగా నిర్వహించబడును. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశేష అభిషేకం, అలంకారాలు, సామూహిక కుంకుమార్చనలు, మూలమంత్ర హోమం, మహామంగళ హారతి, తీర్థప్రసాదం జరుగును. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనం, శ్రీ వాసవీ పెనుకొండ క్షేత్ర పీఠదీపతి పరమపూజ్య శ్రీశ్రీశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామిజీ) వారి పర్యవేక్షణలో దివ్య రథోత్సవము, ఊరేగింపు, ఉంజలసేవ, పవళింపుసేవ, నీరాజన మంత్రపుష్పములు మరియు ప్రత్యేక ప్రసాద వినియోగం నిర్వహించబడును. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందగలరు.